FbTelugu

దుర్గ గుడి ఈఓ పై వరుస కేసులు

విజయవాడ: దుర్గ గుడిలో మరో వివాదం మొదలైంది. క్వార్టర్స్‌ లోని నివాసాన్ని ఖాళీ చేయాలని ఆదేశించి, ఎన్‌ఎంఆర్‌పై కక్షసాధింపు చర్యలకు దిగడంతో ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించాడు.

దేవస్థానంలో 20 సంవత్సరాలుగా తాత్కాలిక ఉద్యోగి (ఎన్‌ఎంఆర్‌)గా పని చేస్తూ.. గుణదలలోని దేవస్థానం క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న కె.శ్రీనివాసరావు కుటుంబాన్ని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాలని ఆదేశిస్తూ ఈఓ సురేశ్‌బాబు ఈనెల 11న నోటీసు జారీ చేశారు. ఈ నోటీసును చాలెంజ్‌ చేస్తూ ఆ ఉద్యోగి బుధవారం కోర్టును ఆశ్రయించారు. శ్రీనివాసరావు పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించడంతో ఈఓ పై మరో కేసు నమోదైంది.  ఈఓ వ్యవహార సరళి రోజు రోజుకూ వివాదాస్పదంగా మారుతోంది.

ఈయనపై కోర్టుకెళుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. సురేశ్‌బాబు నియామకం చెల్లదంటూ ఇటీవల జనసేన నాయకుడు పోతిన వెంకట మహేష్‌ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. దేవదాయశాఖలో పని చేసి ఇటీవల పదవీ విరమణ పొందిన దుర్గాప్రసాద్‌ అనే విశ్రాంత ఉద్యోగి కూడా ఇదే అంశంపై కోర్టులో కేసు వేశారు. తాజాగా ఎన్‌ఎంఆర్‌ శ్రీనివాసరావు బుధవారం కోర్టును ఆశ్రయించడం మరో వివాదానికి దారితీసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.