FbTelugu

తల్లీ కొడుకులను బలిగొన్న రోడ్డు ప్రమాదం

* బైకును ఢీకొన్న బెలేరో వాహనం

మహబూబాబాద్: రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకు మృతి చెందిన ఘటన జిల్లాలోని దోర్నకల్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక దోర్నకల్ లో వేగంగా వచ్చిన ఓ బైకు, బొలేరో వాహనం ప్రమాదవశాత్తూ బలంగా ఢీకొన్నాయి.

ఈ ఘటనలో తల్లీకొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు యాడనగర్ కు చెందిన షేక్ జహిరా, షేక్ పాషాగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.