FbTelugu

హస్పిటల్ కు పంపిస్తే రూ.1 లక్ష బహుమానం

అమరావతి: కరోనా టైములో కొందరు డాక్లర్లు కాసులు ఏరుకుంటున్నారు. తమ వద్దకు దగ్గు, జ్వరంతో వచ్చే వారిని, అనుమానిత లక్షణాలు ఉన్నవారికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ వస్తే వారి పంట పండినట్టే. జేబులు నిండినట్టే.
ఇలా రాష్ట్రంలో కొందరు డాక్టర్లు దందా నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరం ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక డాక్టర్ తనకు వద్దకు వచ్చే రోగులకు పరీక్షలు చేయిస్తారు. నెగెటివ్ వస్తే ఇంటికి పంపించడం, పాజిటివ్ వస్తే మాత్రం కార్పొరేటర్ హాస్పిటళ్లకు సిఫారసు చేస్తున్నాడు. అలా పంపించినందకు సదరు కార్పొరేట్ హాస్పిటల్ రూ. 1 లక్ష బహుమానంగా అందచేస్తున్నది. ఆ డాక్టర్ ఈ మధ్య రూ.1.50 కోట్లు సంపాధించాడు.

కరీంనగర్ లో ఒక డాక్టర్ మరో రకంగా దోపిడి మొదలు పెట్టారు. నర్సింగ్ హోం నడుపుతున్న ఆయనకు కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించే అనుమతి లేదు. అయినా తన వద్దకు పేషెంట్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీటీ స్కాన్ పరీక్ష చేసి కరోనా పాజిటివ్ వచ్చిందని, తొందరగా హాస్పిటల్ లో చేరాలని పురమాయిస్తాడు. ఎలా అంటే తనకు తెలిసిన డాక్టర్లు హైదరాబాద్ లో ఉన్నారని, ఆ హాస్పిటల్ కు వెళ్తే నయమవుతుందని నమ్మబలుకుతాడు. ఇలా ఆయన ఇప్పటి వరకు రూ.2 కోట్లు మూటగట్టుకున్నాడు.
ఇలా కోట్ల రూపాయల్లో దందా నడుస్తుండడంతో మధ్య తరగతి కుటుంబాల వారు ఆస్తులు తెగనమ్ముకుంటున్నారు. కొందరు స్థలాలు, బంగారం విక్రయిస్తున్నారు. మరికొందరు ఫిక్స్ డ్ డిపాజిట్లను వాపస్ తీసుకుంటున్నారు. బతికితే చాలనే విధంగా బాధితులు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు.

You might also like