FbTelugu

దారుణ హత్యకు గురైన రిటైర్డ్ ఏఎస్సై

ప్రకాశం: ఓ రిటైర్డ్ ఏఎస్సై దారుణ హత్యకు గురైన ఘటన జిల్లాలోని మర్టూరు మండలం, బొబ్బెపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. బత్తుల పరశురామారావు అనే ఏఎస్సై దారుణంగా హత్యకు గురైనాడు.

తన కొడుకే కొట్టి చంపినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే కొడుకుకు మతిస్థిమితం లేదని బంధువులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like