FbTelugu

రికార్డు స్థాయిలో ఒక్కరోజే 30వేల కేసులు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఈ మేరకు జాన్ హాప్కన్స్ యూనివర్సిటీ ప్రకటించింది. మే నెల ప్రారంభం నుంచి ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమమని యూనివర్సిటీ వెల్లడించింది. సౌత్ కరోలినా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, అరిజోనా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదు అయ్యాయి.

ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నందున రాబోయే రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదముందని అంటున్నారు. ఇప్పటి వరకు అమెరికాలో కరోనా బారిన 23 లక్షల మందికి పైగా పడగా, 1.21 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

You might also like