FbTelugu

ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 32,695 కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా రోజు రోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. దేశంలో గడిచిన ఒక్కరోజురోజులోనే కొత్తగా 32,695 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 606 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,68,876కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో మొత్తం 24,915 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో 6,12,815 మంది కరోనా బారినుంచి కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 3,31,146 యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.