FbTelugu

బిల్ గేట్స్ కు అరుదైన గౌరవం

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ కు అరుదైన గౌరవం దక్కింది. టై గ్లోబల్ అనే సంస్థ వర్చువల్ గా జరిగిన ఓ కార్యక్రమంలో బిల్ గేట్స్ కు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు (జీవితకాల సాఫల్య పురస్కారం)ను అందించింది.

ఈ అవార్డును పొందిన సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. నూతన ఆవిష్కరణలే ప్రపంచం ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటాయని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.