FbTelugu

కొడుకులపైనే పోలీసు అధికారి కాల్పులు

ముంబయి: ఆయన పదవీ విరమణ చేసిన పోలీసు అధికారి. కాని కరుడుగట్టిన నేరస్తులపై వ్యవహరించిన విధంగా సొంత కొడుకులపై కర్కశంగా వ్యవహరించాడు. ఈ ఘటన నవీ ముంబైలో చోటు చేసుకున్నది.
రబాలే పోలీసుల కథనం ప్రకారం రిటైర్డు పోలీసు అధికారి భగవాన్ పాటిల్ (70) సోమవారం సాయంత్రం కుమారులతో గొడవ జరిగింది.

కారు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుపై పాటిల్ కు, ఆయన కుమారులు విజయ్ (35), సుజయ్(30) మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో ఆగ్రహం ఆపుకోలేకపోయిన పాటిల్ తన ఇద్దరు కుమార్ పై తుపాకి ఎక్కుపెట్టాడు. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో విజయ్ అక్కడికక్కడే చనిపోగా, మరో కుమారుడు సుజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాటిల్ ను పోలీసులు అరెస్టు చేసి ఆయన నుంచి లైసెన్స్డు ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.