FbTelugu

ప్రగతి భవన్ ముందు చిరు వ్యాపారి…

హైదరాబాద్: ప్రగతి భవన్ ముందు పాతబస్తీకి చెందిన ఒక వ్యక్తి హల్ చల్ చేశాడు. ఒంటిపై పెట్రోల్ తో ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు.

ఇవాళ పాతబస్తీకి చెందిన ఎం.డి.నజీరుద్దిన్ ఒంటి పై పెట్రోల్ పోసుకుంటున్న సమయంలో అక్కడున్న ప్రగతి భవన్ సిబ్బంది వెంటనే అడ్డుకున్నారు. రెండు నెలలుగా పని లేకపోవడంతో కుటుంబం సాకలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా వ్యాపారంలేదు, ఆదాయం లేదని తెలిపాడు.

ఆదాయం లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందనన్నారు.  ప్రభుత్వం నా లాంటి చిరు వ్యాపారులకు ఆదుకోవాలని కోరాడు. ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియడం లేదని, అందుకే ఇక్కడకు వచ్చిన ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించినట్లు నజిరుద్దీన్ తెలిపాడు. అతన్ని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

You might also like