FbTelugu

దివ్య హత్యను కప్పిపుచ్చేందుకు భారీ యత్నం

విశాఖలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయపడుతున్నాయి. దివ్యను హత్య చేయించిన వసంత గుట్టు చప్పుడు కాకుండా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు భారీ స్కెచ్ వేసినట్టు విచారణలో తేలింది. దివ్య హత్య అనంతరం వసంత

అంతిమయాత్ర వాహనం డ్రైవర్ కు ఫోన్ చేసింది. కానీ వసంత పొంతనలేని సమాధానాలతో డ్రైవర్ నాయుడు వాహనాన్ని పంపేందుకు నిరాకరించారు. దీంతో నేరుగా గ్నానాపురం శ్మశాన వాటికకు వెళ్లి తన ఇంట్లో పనిమనిషి చనిపోయిందని ఎంత ఖర్చు అయినా భరిస్తానని వాహనాన్ని పంపాలని కోరింది. దీంతో అనుమానం వచ్చిన వారు పోలీసులకు సమాచారం అందించారు.

You might also like