FbTelugu

గుండెపోటుతో వ్యక్తి మృతి.. దగ్గరకి రాని స్థానికులు

కరీంనగర్ : గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందగా స్థానికులు దగ్గరకు రాకుండా ఉన్న ఘటన జిల్లాలోని ఓ రైతు బజార్లో చోటుచేసుకుంది.  దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. ఓ వ్యక్తి గుండెపోటుతో విలవిల్లాడుతూ కుప్పకూలిపోయిన వ్యక్తికి కనీసం సాయం కూడా చేయని దయనీయ పరిస్థితి చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే ఆ
ఆ జిల్లాకి కొందరు ఇండోనేషియా వాసులు రాగా వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో జిల్లాలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. ఈ తరుణంలో వ్యక్తి అలా చనిపోయినప్పటికి సాయం చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుని బంధువులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More