FbTelugu

దూసుకొస్తున్న ఉమ్ ఫున్ తుఫాన్

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిని ఉమ్ ఫున్ తుఫాన్ అతి తీవ్ర తుఫానుగా మారి దూసుకొస్తోంది. ఒడిషాలోని పారాదీప్ కు దక్షిణంగా 210 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది.

ఉత్తర ఈశాన్యంలో పయనించి ఈ రోజు సాయంత్రానికి పశ్చిమబెంగాల్ లోని సుందర్ బన్స్ సమీపాన తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుఫాన్ ప్రభావంతో గంటకు 155 నుంచి 165 కిలోమీట్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ తరుణంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని తెలిపింది. ఇప్పటికే ఏపీలోని అన్ని పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు.

You might also like