FbTelugu

ఫెన్సింగ్ లో చిక్కుకుపోయిన చిరుత

నల్లగొండ: ఓ చిరుత ప్రమాదవ శాత్తు ఫెన్సింగ్ లో చిక్కుకు పోయిన ఘటన జిల్లాలోని మర్రిగూడ మండలం, రాజపేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఇవాళ ఉదయం గ్రామవాసులు ఫెన్సింగ్ లో చిక్కుకుపోయిన చిరుతను గుర్తించారు.

దీంతో భయాందోళనకు గురై అధికారులకు సమాచారం అందించారు. ఫెన్సింగ్ నుంచి చిరుత బయటకు వచ్చే చాన్స్ ఉందని పోలీసులు అక్కడికి ఎవ్వరినీ వెళ్లవద్దని సూచించారు. చిరుతకు మత్తు ఇచ్చి పట్టుకోవాలని ఫారెస్టు అధికారులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

You might also like