హైదరాబాద్: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇవాళ నగరంలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుడింగల్ లో ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
మంటల దాటికి ఆశ్రమంలోని రెండు ఆలయాలకు మంటలు అంటుకోగా.. ఓ షర్డు మంటలకు కాలి బూడిదైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నారు.