FbTelugu

ఏనుగుల గుంపు హల్ చల్

చిత్తూరు: జిల్లాలో ప్రజలు ఏనుగుల పేరు చెబితేనే హడలిపోతున్నారు. పలమనేరు మండలం మండపేట కోడూరు వద్ద రోడ్డుపై 38 ఏనుగుల గుంపు హల్ చల్ చేశాయి.

మండపేట గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపుతో ఉభయ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఇదేవిధంగా ఏనుగుల గుంపు దాడిలో పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఏనుగుల బారి నుంచి కాపాడండి అంటూ రైతులు ప్రజలు వేడుకుంటున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేశారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.