FbTelugu

భారీగా పట్టుబడిన సారాయి

కృష్ణా: జిల్లాలోని విస్సన్నపేటలో ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు చేపట్టిన దాడుల్లో భారీగా సారాయి, ఊట బెల్లం పట్టుబడింది. వివరాల్లోకెళితే.. అక్రమంగా సారాయి కాస్తున్న

ముఠాలపై అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు చేపట్టిన దాడుల్లో 120 లీటర్ల సారాయి, 3,500 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అక్రమంగా సారాయి కాస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

You might also like