FbTelugu

తీవ్ర తుఫానుగా మారిన వాయుగుండం

ముంబయి: ఓ పక్క దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు పడుతుండగా.. తాజాగా అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారినట్టు వాతావరణ తెలిపింది.

ఈ తుఫాను ముంబయికి దక్షిణ, నైరుతి దిశలో సుమారు 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు తెలిపింది. ఈ తుఫానుకు ‘నిసర్గ’ అని పేరు పెట్టారు. ఈ తుఫాను మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ ల గుండా భారత్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో అక్కడి తీర ప్రాంత ప్రజలకు తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు.

You might also like