FbTelugu

భారీ తుఫానుగా మారిన వాయుగుండం

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పెను తుఫానుగా మారింది. ఈ తుఫాను ప్రభావంతో రేపటి నుంచి ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ తుఫాను బెంగాల్ లోని దిఘాకు 1,200 కిలోమీటర్ల దూరంలో, ఒడిషాలోని పారాదీప్ కు 1,040 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు అధికారులు తెలిపారు. ఈ తుఫానుకు ‘ఎంఫాన్’ గా నామకరణం చేశారు. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

You might also like