FbTelugu

పట్టుబడిన దొంగనోట్ల ముఠా

పశ్చిమ గోదావరి: జిల్లాలోని పాలకొల్లులో దొంగనోట్ల ముఠా పోలీసులకు పట్టుబడింది. వారి నుంచి భారీగా దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకెళితే.. స్థానిక పాలకొల్లులో దొంగనోట్లను ముద్రిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి రూ.7,85,000 దొంగనోట్లు, రూ.40వేల ఒరిజినల్ నగదును స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి ఓ ప్రింటర్, మూడు ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like