FbTelugu

పట్టుబడిన నకిలీ బంగారం ముఠా

కృష్ణా: ఓ ముఠా నకిలీ గోల్డ్ కాయిన్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడిన ఘటన జిల్లాలోని కలిదిండిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు నకిలీ బంగారం

విక్రయిస్తూ స్థానిక కలిదిండిలో పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్దనుంచి 53 నకిలీ బంగారు కాయిన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.4.5 లక్షల నగదు, నాలుగు బైకులు, 4 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like