FbTelugu

‘చెయ్యి’జారనున్న మరో మాజీ మంత్రి!

* పార్టీని వీడే యోచనలో కాంగ్రెస్ మాజీ మంత్రి

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనున్నట్టే తెలుస్తోంది. కాంగ్రెస్ మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. చంద్రశేఖర్ ను బీజేపీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఇవాళ పార్టీ కార్యకర్తలతో ఆభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.

అలాగే బీజేపీ ముఖ్య నేతలతో చంద్రశేఖర్ సమావేశం నిర్వహించనున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ 2 సీట్లు మాత్రమే గెలుచుకొని తన ఉనికిని కాపాడుకోలేని స్థితిలోకి వెళ్లడంతో.. కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.