FbTelugu

కొడుకును నేలకేసి కొట్టిన తండ్రి

A-father-who-beat-his-son-to-the-ground

ప్రకాశం: రాచర్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో కొడుకును హత్య చేశాడో తండ్రి. గుమ్మల్ల చిన్న పుల్లయ్య అనే వ్యక్తి భార్యపై అనుమానంతో 8 నెలల కన్నకొడుకు హేమంత్ కుమార్ ని నేలకేసి కొట్టి చంపాడు. భార్య రమాదేవి పై అనుమానంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. భార్యను కత్తితో గాయపరచడమే కాకుండా రోకలి బండతో దారుణంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ భార్యను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని, మరో 24 గంటలు గడిస్తే కాని చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. గతంలో కూడా చిన్న పుల్లయ్య అర్ధవీడు మండలం మోహదిపురం లో మొదటి భార్య లక్ష్మీదేవి ని అనుమానంతో గొడ్డలితో నరికి చంపాడు. ఈ హత్య ఘటనలో ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. రెండు సంవత్సరాల క్రితం రెండో పెళ్లి చేసుకున్న పుల్లయ్య అనుమానంతో తన కొడుకుని చంపాడు. అనుమానంతో భార్యను తీవ్రంగా గాయపరిచాడు. పరారీలో ఉన్న నిందితున్ని త్వరలో పట్టుకుని శిక్షిస్తామని సీఐ సుధాకర రావు వెల్లడించారు.

You might also like