FbTelugu

ఆవు కోసం హెలికాప్టర్ నే రప్పించిన రైతు

బెర్న్: స్విట్జర్ లాండ్ ఒక ఆవుకు గాయమైంది. ఇంకేముంది ఆ ఆవును హెలికాప్టర్ ద్వారా నొప్పి కలుగకుండా ఇంటికి రప్పించుకున్నాడు. ఈ ఘటనపై ఎవరో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

స్విస్ ఆల్ప్స్ లో ఒక పర్వతం వద్ద ఆవు మేతకోసం వెళ్లింది. ఏమైందో ఏమో దాని కాలికి గాయమైంది. నొప్పితో కుంటుతున్న దృశ్యం యజమాని రైతు కు తెలిసింది. అలాగే నొప్పితో ఇంటికి తీసుకువస్తే గాయం పెరిగి పెద్దది అవుతుందని భావించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వ అధికారులకు తెలియచేశాడు.

యజమాని వినతి మేరకు రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. ఆల్ఫ్స్ పర్వత ప్రాంతానికి హెలికాప్టర్ లో వెళ్లి ఆవును తాళ్లతో బంధించి సురక్షితంగా తీసుకువచ్చారు. దాన్ని చూసిన యజమానికి మహానందానికి గురయ్యాడు. అప్పటికే వెటర్నరీ వైద్యులను ఇంటికి పిలిపించుకుని చికిత్స కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాడు. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు రైతును అభినందిస్తున్నారు.

You might also like