FbTelugu

పిల్లి కాదది… పులి…

ప్యారిస్: ఒక జంట ముచ్చటపడి పిల్లి పిల్లను రూ.6 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. దాన్ని అల్లారు ముద్దుగా చూసుకుంటూ పెంచుకుంటున్నారు. దానితో సెల్ఫీలు దిగడం, ముద్దాడం చేస్తున్నారు. కొద్ది నెలల తరువాత దాని అసలు రూపం చూసి భీతిల్లిపోయారు.

పిల్లి లక్షణాలకు బదులు పులి లక్షణాలు కన్పించడంతో ముచ్చెమటలు పట్టాయి. ఇంకేముందు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఇంతకీ పులి పిల్లను ఎక్కడ కొనుగోలు చేశారో చెప్పడంతో గుట్టు మొత్తం బయటకు వచ్చింది. నార్మండికి చెందిన లా హవ్రే దంపతులకు పిల్లులంటే చాలా ఇష్టం. రెండేళ్ల క్రితం ఆన్ లైన్ ప్రకటన చూసి వారిని సంప్రదించారు. సవన్నా జాతికి చెందిన దాన్ని కొనుగోలు చేశారు. అయితే పిల్లి బదులు వారు పులి పిల్లను విక్రయించారు. ఇండోనేషియా దేశం నుంచి అక్రమ రవాణ చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే 9 మందిని ప్రాన్స్ పోలీసులు అరెస్టు చేశారు. పులిని ఫ్రెంచ్ జీవ వైవిద్య విభాగానికి అప్పగించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.