FbTelugu

కూలిన శిథిల భవనం… 10 మంది మృతి

బివాండీ: మహారాష్ట్రలోని బివాండిలో మూడంతస్తుల భవనం కూలిన దుర్ఘటనలో పది మంది మృతి చెందారు. శిథిలాల్లో చిక్కుకున్న 20 మందిని స్థానికులు కాపాడారు.
ఈ ఘటన నగరంలోని పటేల్ కాంపౌండ్ లో చోటు చేసుకున్నది. ఎన్డీఆర్ ఎఫ్ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా పాతిక మంది వరకు చిక్కుకున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.

శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని కూల్చివేయాలని ఇప్పటికి రెండుసార్లు నోటీసులు ఇవ్వగా, కూల్చేయడానికి యజమాని ముందుకు రాలేదని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనలో సహాయక చర్యలు పూర్తయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో శిథిల భవనాలు నాని, కూలిపోతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.