భువనేశ్వర్: 50 మందితో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తూ బోల్తాపడిన ఘటన ఒడిషాలోని కోక్సొర పీఎస్ పరిధిలోని బొడోకెందుగుడ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఓ ప్రైవేటు బస్సు 50 మంది ప్రయాణికులతో ఒడిశా నుంచి హైదరాబాద్ కు వస్తుండగా.. స్థానిక బొడోకెందుగుడ సమీపంలో ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలు కాగా మరో 20 మందికి స్వల్పగాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తన్నట్టు తెలిపారు.