FbTelugu

రమ్యకృష్ణ కారులో విస్కీ, బీరు బాటిళ్లు

చెన్నై: ప్రముఖ నటి రమ్యకృష్ణ వ్యక్తిగత వాహనంలో మద్యం బాటిళ్లు పెద్ద ఎత్తున లభ్యమయ్యాయి.

కరోనా కారణంగా చెన్నై నగరంలో మద్యం విక్రయాలు నిలిపివేశారు. ఇవాళ చెన్నై ఈసీఆర్ రోడ్డులో కానత్తూరు సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. రమ్యకృష్ణ కు చెందిన ఇన్నోవా కారు (టీఎన్07క్యూ 0099) కూడా తనిఖీ చేయగా పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లు బయటపడ్డాయి.

96 బీరు బాటిళ్లు, 8 విస్కీ బాటిళ్లు లభ్యమయ్యాయి. అక్రమంగా మద్యం తరలిస్తున్నారంటూ డ్రైవర్ పై, వాహనంపై కేసులు నమోదు చేశారు. డ్రైవర్ సెల్వ కుమార్ ను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు పంపించారు. ఈ విషయం తెలుసుకున్న రమ్యకృష్ణ వెంటనే పోలీసు స్టేషన్ కు వచ్చి వ్యక్తిగత బెయిల్ పై తీసుకుని వెళ్లారు.

You might also like