FbTelugu

పివి ఎక్స్ ప్రెస్ వే పై కారును ఢీకొట్టిన బైక్

హైదరాబాద్: మద్యం మత్తులో ఒక యువకుడు పివి ఎక్స్ ప్రెస్ వే పై బైక్ ను నడపడమే కాకుండా రంగ్ రూట్ లో వెళ్లి క్యాబ్ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.

స్థానికుల కథనం ప్రకారం ఇవాళ తెల్లవారు జామున పిల్లర్ నెంబర్ 323 వద్ద ఈ ప్రమాదం జరిగింది. మెహిదిపట్నం నుంచి శంషాబాద్ కు వెళ్తున్న క్యాబ్ ను రాంగ్ రూట్ లో వస్తున్న షేక్ జావేద్ బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అంబూలెన్స్ లో ఉస్మానియా కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం పివి ఎక్స్ ప్రెస్ వే పై టూ వీలర్స్ కు అనుమతి లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.