FbTelugu

హెచ్‌డీఎఫ్‌సీ కి పెద్ద దెబ్బ

ముంబై: దేశంలో ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో దూసుకువెళ్తున్న హెచ్‌డీఎఫ్‌సీ కు పెద్ద దెబ్బ తగిలింది. వాహన-ఫైనాన్సింగ్ విభాగంలో తప్పుడు విధానాలు అవలంభించడం మూలంగానే క్లాస్ యాక్షన్ వ్యాజ్యం దాఖలు చేసినట్లు రోసన్ లా కంపెనీ ప్రకటించింది.

అమెరికాకు చెందిన న్యాయ సంస్థ రోసన్ లా కు ప్రపంచ వ్యాప్తంగా పేరున్నది. పొటెన్షియల్ క్లెయిమ్స్ పై షేర్ హోల్డర్స్ తరఫున విచారణ మొదలుపెట్టామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వాహన రుణాల లక్ష్యాన్ని చేరుకునేందుకు అడ్డగోలు విధానాలను అవలంభించిందని కంపెనీ ఆరోపించింది. దీనిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆరుగురు సీనియర్, మిడిల్ స్థాయి అధికారులను తప్పించింది. ఈ వివాదంపై క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆర్బీఐ కు గత నెలలో ఫిర్యాదు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు, వాటాదారులకు రక్షణగా నిలిచే రోసన్ లా వ్యాజ్యంపై బ్యాంకింగ్ రంగంలో సంచలనంగా మారింది. గతంలో ఇన్ఫోసిస్ సంస్థ అనుసరిస్తున్న తప్పుడు విధానాలను కూడా రోసన్ లా తప్పు పట్టిన విషయం తెలిసిందే.

You might also like