FbTelugu

13 ఏళ్ల బాలికతో 37 ఏళ్ల వ్యక్తి పెళ్లి

రంగారెడ్డి: ఈ రోజుల్లో కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కాలంలోనూ నడి వయస్సు వ్యక్తి 13 బాలికను వివాహం చేసుకున్నాడు.

ఫరూక్‌నగర్‌ మండలంలోని అయ్యవారిపల్లి లో 13 ఏళ్ల బాలికను 37 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించిన విషయం బయటపడింది. ఈ విషయం పోలీసు స్టేషన్ కు వెళ్లడంతో బాలికను పెళ్లాడిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.  పోలీసుల కథనం ప్రకారం.. మల్లేశ్ షాద్‌నగర్‌లోని ఓ మద్యం దుకాణంలో పనిచేస్తాడు. అతడికి ఇద్దరు పిల్లలు ఉండగానే కొన్నాళ్ల క్రితం అతడి భార్య చనిపోయింది.

రెండో పెళ్లి చేసుకోవాలని భావించిన మల్లేశ్.. అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికను చేసుకోవాలని నిర్ణయించాడు. తన కుమార్తె కంటే ఐదేళ్లు మాత్రమే ఆ బాలిక పెద్దది. బాలిక తల్లితో అప్పటికే పరిచయం ఉండడంతో ఒప్పించి ఈ నెల 15న బాలికను రహస్యంగా వివాహమాడాడు. ఈ విషయం ఐసీడీఎస్, రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లడం, పోలీసులు కేసు నమోదు చేయడంత మల్లేశ్ పరారీ అయ్యాడు. ఐసీడీఎస్ సిబ్బంది గ్రామానికి చేరుకుని బాలిక, ఆమె కుటుం సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం బాలిక ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఉంది.

You might also like