FbTelugu

9ఏళ్ల బాలికపై యువకుడు దారుణం..

9yearold-girl-brutally-attacked-by-young-men

గద్వాల: తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మల్దకల్ మండలానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు సాయంత్రం వేళ బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై సమీపంలోని పొలానికి తీసుకెళ్లి తన అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా ఆ రాత్రి బాలిక కడుపు నొప్పితో బాధపడటం గమనించిన అమ్మమ్మ ఏమైందని అడగగా జరిగిన విషయం తెలిసింది. దీంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు నరేశ్‌పై నిర్భయ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

You might also like