FbTelugu

9, 10, 11 తరగతుల విద్యార్థులు పాస్

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నది. 9, 10, 11 తరగతుల విద్యార్థులకు ఎలాంటి పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించడం లేదని ప్రకటించింది.

వారందరూ ఎలాంటి పరీక్షలు లేకుండా ఈసారి పాస్ చేసినట్లు వెల్లడించింది. గతేడాది కూడా ఈ నిర్ణయం తీసుకున విషయం తెలిసిందే. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మార్కులు వేయనున్నట్లు ప్రకటించారు. దీనికి అదనంగా హాజరు శాతాన్ని బట్టి 20 శాతం వేయిటేజి కలపనున్నట్లు వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.