FbTelugu

ఏపిలో 96 మంది కరోనాతో మృతి

అమరావతి: రాష్ట్రంలో వరుసగా నాలుగు రోజుల నుంచి 20వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మళ్లీ 20వేల మందికి పైగా కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ తెలిపారు.

రాష్ట్రంలో మొత్తం 1,10,571 నమూనాలు పరీక్షించగా, 20,065 మంది కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. పాజిటివిటీ రేటు 19.75శాతం ఉండగా, అత్యధికంగా 96మంది మృతి చెందారు. చిత్తూరులో 2,269 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 2,370, విశాఖపట్నం లో 2525 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో పశ్చిమ గోదావరిలో 14మంది, విశాఖలో 12మంది చనిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.