FbTelugu

ఒకే పౌల్ట్రీలో 900 కోళ్లు మృతి

* బర్డ్ ఫ్లూపై కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరికలు
* మనుషులకు సోకకుండా చూడాలని సూచన
న్యూఢిల్లీ: దేశంలో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ ఏడు రాష్ట్రాలకు వ్యాపించింది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కు ఈ వైరస్ వ్యాపించింది. నిన్న ఒక్క రోజులోనే దేశంలో మొత్తం 1,200 పక్షులు మృత్యువాత పడినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు.

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పటికే పక్షుల దిగుమతిని ప్రభుత్వం నిషేధించింది. మహారాష్ట్రలోని ఓ ఫౌల్ట్రీ లో ఏకంగా 900 కోళ్లు మృతి చెందాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ మనుషులకు సోకకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.