FbTelugu

తుఫాన్ ప్రభావం… 90 రైళ్లు రద్ధు

కోలకతా: యస్ తుఫాను తీవ్రం నుంచి అతి తీవ్రంగా మారే సూచనలు ఉండడంతో ప్రభుత్వ విభాగాలు అప్రమత్తమవుతున్నాయి. దూసుకువస్తున్న యస్ తుఫాన్ రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫాను గా మారనున్నది.

ఆ తదుపరి 24 గంటల్లో అతి తీవ్ర తుఫాను గా మారుతుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఒడిశాలోని పారాదీప్ కు దక్షిణ ఆగ్నేయ దిశగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నెలా 26 ఉదయనికి ఒడిశా-బెంగాల్ రాష్ట్రాల మధ్య తీరం తాకే అవకాశం ఉంది. ర్ట్ బ్లెయిర్ (అండమాన్ దీవులు) కు ఉత్తరాన వాయువ్య దిశలో 620 కిలోమీటర్లు, పారాదీప్ (ఒడిశా) కి 530 కిలోమీటర్లు, బాలసోర్ (ఒడిశా) కి ఆగ్నేయంగా 630 కి.మీ, దిఘా (పశ్చిమ బెంగాల్) కి ఆగ్నేయంగా 620 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయింది. ఈ తుఫాన్ కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ పై తీవ్ర ప్రభావం చూపించనున్నది. దీంతో తూర్పుకోస్తా రైల్వే చర్యలు చేపట్టింది. తుఫాన్ ప్రభావిత రూట్లలో 90 రైళ్లను రద్దు చేసింది. ప్రభావాన్ని బట్టి మరో 10 రైళ్లను రద్దు చేయనున్నది.
ఉత్తరాంధ్రలో వర్షాలు…
ఈ రోజు , రేపు అక్కడక్కడ ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తీరందాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుంది. సముద్రంలో అలలు 2.9 – 4.5 మీటర్ల ఎత్తులో‌ ఎగసి పడతాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపి విపత్తు అధికారులు సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.