FbTelugu

90శాతం హాస్పిటళ్లకు ఫైర్ సేఫ్టీ లేదు: జీహెచ్ఎంసీ

హైదరాబాద్‌: విజయవాడ నగరంలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్-19 సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంతో గ్రేటర్ హైదరాబాద్ అప్రమత్తమైంది.

గ్రేటర్ పరిధిలో ఉన్న సుమారు 1721 ఆసుపత్రులకు హెల్త్ డిపార్ట్‌మెంట్ లైసెన్సులు జారీ చేయగా.. వాటిల్లో 90 శాతం అంటే దాదాపు 1600 హాస్పిటల్స్ ఫైర్ నిబంధనను పాటించడం లేదని గుర్తించారు. ఆసుపత్రులపై జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను సిద్ధం చేసింది.

ఈ నిబంధనలను పాటించిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే బయటపడే మార్గాలు లేవని స్పష్టమైంది. అలాగే కొన్ని ఆసుపత్రుల్లో అయితే ఇంకా పూర్తిస్థాయిలో ఫైర్ ఎక్యిప్‌మెంట్‌ సిద్ధం కాలేదని అధికారులు తమ తనిఖీల్లో కొనుగొన్నారు. మరికొన్ని ఆసుపత్రులు అయితే సెల్లార్లలోనే ల్యాబ్ లు, మెడికల్ షాపులను దర్జాగా ఏర్పాటు చేశాయి. ఎక్కువ శాతం నర్సింగ్ హోమ్‌లు, ఆసుపత్రులు రెసిడెన్షియల్ భవనాల్లో ఉన్నాయి. ఇక ఆయా ప్రైవేట్ ఆసుపత్రులకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ నోటీసులు జారీ చేసింది. అయితే ఫైర్ సేఫ్టీ నిబంధనలపై పలు ప్రైవేట్ ఆసుపత్రులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చాయి.

You might also like