FbTelugu

రేవ్ పార్టీలో 90 మంది అరెస్టు

నల్గొండ: సంస్థాన్ నారాయణపూర్ లో రేవ్ పార్టీ లో పాల్గొన్న 90 మంది యువకులను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. 90 మంది యువకులతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారు.

సంస్థాన్ నారాయణపురంలోని ఒక రిసార్ట్ లో రెవ్ పార్టీ జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం స్థానికులు అందించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రేవ్ పార్టీని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. తెల్లవారుజాము వరకు రేవ్ పార్టీ నడవడంతో యువతీ, యువకులు మద్యం మత్తులో జోగుతూ ఉన్నారు. నగర శివారు ప్రాంతాల్లో నిర్వహిస్తే పోలీసు దాడులు ఉంటాయని గమనించి ఈ మధ్యకాలంలో జిల్లాలకు వెళ్లి రేవ్ పార్టీలు చేసుకుంటున్నారు. వీరి పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.