FbTelugu

సికింద్రాబాద్ నుంచి 9 రైళ్లు

సికింద్రాబాద్: జూన్ నుంచి దేశ వ్యాప్తంగా తిరిగే 200 రైళ్ల లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.

ఇందులో సూపర్ ఫాస్ట్ రైళ్లు 4, ఎక్స్ ప్రెస్ రైళ్లు 5 ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి హౌరా, ధానా పూర్, గుంటూరు, నిజాముద్దీన్ వరకు రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేష్ తెలిపారు. హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి డిల్లీ, ముంబై, విశాఖపట్నం వరకు రైళ్లు నడుస్తాయన్నారు. తిరుపతి నుంచి నిజామాబాద్ ఒక రైలు, నాందేడ్ నుంచి అమృత్ సర్ కు ఒక రైలు ఉంటాయన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్ నుంచి 8 రైళ్లు డైలీ నడుస్తాయని, ఒక్క వీక్లీ ట్రైన్ కూడా ఉందన్నారు.

రైల్వే నడుపుతున్న శ్రామిక్, స్పెషల్ ఏసీ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు. దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో వలస కూలీలు తరలించింది. రైల్వే స్టేషన్ లలో ప్రయాణికుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ప్రతి రైలును పరిశుభ్రంగా పెడతామని, ప్రతి బోగి శానిటైజ్ చేస్తామన్నారు. స్పెషల్ రైళ్లలో ప్రయాణించేందుకు రిజర్వేషన్ చేసుకున్న విధంగానే జూన్ నుంచి ప్రారంభంకాబోయే రైళ్లలో కూడా రిజర్వేషన్ చేసుకోవాలని ఆయన కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.