FbTelugu

9 కాదు 10 మంది హత్య!

వరంగల్‌: నగర శివారు గొర్రెకుంట బావి ఘటనలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో విస్తుగొలిపే విషయాలు వెల్లడి అయినట్లు సమాచారం.

తొమ్మిది మందే కాదు అంతకు ముందు ఓ యువతిని చంపేసినట్టు నిందితుడు సంజయ్ యాదవ్ పోలీసులకు వెల్లడించాడు. మక్సూద్ బంధువైన యువతి సంజయ్​కి సన్నిహితంగా ఉండేది. కొన్నాళ్లుగా ఆమె కనిపించడం లేదు. ఈ తొమ్మిది హత్యల గురించి విచారణ చేయగా, అంతకు ముందే ఒకరిని చంపినట్లు ఒప్పుకున్నాడు. మార్చి8న ఆ యువతిని నిడదవోలు లో రైలు నుంచి తోసేసి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.

కోల్‌కతా తీసుకెళ్తున్నానని చెప్పి ఈ దారుణానికి సంజయ్​కుమార్​ పాల్పడ్డాడు. ఆమెను చంపిన విషయం పోలీసులకు చెబుతారనే భయంతో మక్సూద్​ కుటుంబాన్ని మట్టుబెట్టినట్లు తెలిపాడు. ఇలా మొత్తం 10 మందిని హత్య చేశాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.