FbTelugu

కరోనాపై 9 నెలల చిన్నారి విజయం!

నెల్లూరు: కరోనా మహమ్మారి బారినపడిన 9 నెలల చిన్నారి కోలుకుంది. రెండు వారాల చికిత్స తర్వాత కోలుకున్న పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.

నెల్లూరు నగరంలోని కోటమిట్ట ప్రాంతంలో ప్రభుత్వం ఇటీవల కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించింది. స్థానికంగా నివసించే ఓ కుటుంబంలోని 9 నెలల చిన్నారికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది.

రిపోర్టులు వచ్చిన వెంటనే ఆ చిన్నారిని నగరంలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. డాక్టర్లు నిరంతరం పర్యవేక్షించి, చిన్నారికి వైద్య సేవలు అందించారు. రెండు వారాల తర్వాత ఆమెకు పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది. ఆరోగ్యంగా ఉండడంతో ఆదివారం నాడు డిశ్చార్జ్ చేశారు. అయితే చిన్నారి ద్వారా తల్లి తండ్రులకు వైరస్ సోకలేదు.

You might also like