FbTelugu

గనిలో పేలుడు.. 9మంది మృతి

కడప: కలసపాడు మండలం మామిళ్లపల్లె శివారులో ప్రమాదవశాత్తు పేలుళ్లు సంభవించడంతో 9 మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యారు. ముగ్గురాళ్ల గనిలో రాయి తొలగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

పేలుడు ధాటికి మృతేదేహాలు నుజ్జనుజ్జయ్యాయి. బద్వేలు నుంచి జిలెటిన్‌స్టిక్స్‌ ను గని యజమాని తెప్పించారని కార్మికులు తెలిపారు. పేలుడు సమయంలో దాదాపు 20 మందికి పైగా ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 7 మంది మృత దేహాలను లభ్యమైనట్లు సమాచారం. మామిళ్లపల్లెలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ముగ్గురాళ్ల గనిలో రాయి తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు పలువురు మృతి చెందడం బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి నెలకొనడం బాధాకరం అని వెంటనే స్పందించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.