FbTelugu

రేపటి నుంచే 8వ తరగతి క్లాసులు: ఆదిమూలపు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచే 8వ తరగతి క్లాసులు ప్రారంభం కానున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 14 నుంచి 6,7 తరగతులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు క్లాసులు నడపనున్నట్టు తెలిపారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్కూళ్లను పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో పలు సడలింపులు ఇస్తూ.. విద్యాసంస్థలను నడిపేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.