FbTelugu

ఢిల్లీ లో 89 వ్యాక్సినేషన్ సెంటర్లు: మంత్రి జైన్

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మొదటి దశ వ్యాక్సినేషన్ కోసం 89 ప్రాంతాలు ఖరారు చేసినట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. జనవరి 16 నుంచి 36 ప్రభుత్వ, 53 ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించినట్లు వివరించారు.

మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమే ఇవ్వనున్నామని, ఆ తదుపరి 50 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసినవి చేసినట్లుగా వెంటవెంటనే ప్రజలకు ఇస్తామని, నిల్వ చేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. డిమాండ్ కు తగ్గట్లుగా సరఫరా చేస్తుందా లేదా అనేది ఇంకా తెలియదని మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.