ఢిల్లీ: భారత సైన్యం 89 మొబైల్ యాప్స్ వినియోగంపై పూర్తిగా ఆంక్షలు విధించింది. ఈ మేరకు జాబితా కూడా విడుదల చేసింది.
సైన్యంలో పనిచేసే సిబ్బందికి ఎవరూ కూడా ఈ మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించరాదని ఆదేశాలు ఇచ్చింది. నిషేధించిన యాప్‌లలో ఫేస్బుక్, టిక్‌టాక్, ట్రూకాలర్, ఇన్స్టాగ్రాం తో పాటు డైలీ హంట్ కూడా ఉంది. పొరుగు దేశాలు, శతృదేశాలకు సైనిక సమాచారం లీక్ కాకుండా చూడడమే ఈ నిషేధం ముఖ్య ఉద్దేశ్యమని సైన్యం ప్రకటించింది.
ఇప్పటికే భారత ప్రభుత్వం టిక్ టాక్ తో పాటు కొన్ని యాప్స్ నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా గూగుల్, ఫేస్ బుక్ సంస్థలకు 72 గంటల నోటీసులు జారీ చేసింది. వినియోగదారులు లేదా ఖాతాదారుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారు, గోప్యత తదితరాలపై 72 గంటల్లోగా తెలియచేయాలని నోటీసులు పంపించింది.