FbTelugu

ఏపీలో ఒక్కరోజే కరోనాతో 87 మంది మృతి

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ తో ఒక్కరోజే 87 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8732 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,81,817 కి చేరింది.

24 గంటల వ్యవధిలో 53,712 నమూనాలను పరీక్షించగా 8732 మంది వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యిందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 1,91,117 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 88,138 మంది ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నారు. ఇవ్వాళ్టి వరకు 2,562 మంది చనిపోయారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

You might also like