FbTelugu

ఏపీలో కేసులు 8,555

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతునే ఉన్నది. ఇవాళ 8,555 పాజటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

ఇవాళ నమోదు అయిన సంఖ్యతో మొత్తం కేసులు 1,58,764కు చేరుకోగా, ఇప్పటి వరకు 82,886 కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. యాక్టివ్ కేసులు 74,404 కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 6,272 మంది కోలుకున్నారు. ఇవాళ 67 మంది చనిపోగా, ఇప్పటి వరకు 1,47 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 20.65 లక్షల నమూనాలు సేకరించారు.

You might also like