FbTelugu

రెండు వేర్వేరు ఘటనల్లో 8 మంది మృతి

తూ:గో జిల్లా: పెద్దాపురం ఎడిబి రోడ్డు ఇండ్రస్టీయల్ ఏరియా వద్ద గృహ శంఖుస్థాపన కార్యక్రమానికి వెళ్తున్న కారు లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందగా మృతుల్లో ఐదు నెలల చిన్నారి ఉంది.
కారులో ఇరుక్కున్న ఐదుగురిని పెద్దాపురం పోలీసులు బయటకు లాగి ఆసుపత్రికి తరలించారు. తాళ్ళరేవు మండలం పెద్ద వలస నుండి రాజమహేంద్రవరం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నదని పోలీసులు తెలిపారు.

రసాయన పరిశ్రమ ప్రమాదం… నలుగురు మృతి

తమిళనాడులోని కడలూర్‌లో ఉన్న ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి పరిశ్రమలోని బాయిలర్‌ పేలడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 12 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను కడలూర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.