FbTelugu

ఆక్సిజన్ కొరతతో 8 మంది మృతి

పనాజీ: ఆక్సిజన్ కొరత కారణంగా అక్కడక్కడా కరోనా బాధితులు చనిపోతూనే ఉన్నారు. తాజాగా గోవాలో ఆక్సిజన్ లభించక 8 మంది ప్రాణాలు గాలిలో కలిశాయి.
గోవా మెడికల్ కాలేజీలో కరోనా వార్డులో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో 8 మంది చనిపోయారు.

ఇప్పటి వరకు ఆక్సిజన్ లభించక మొత్తం 83 మంది చనిపోయారు. వీటిలో అత్యధిక మరణాలు అర్థరాత్రి 2 గంటల నుంచి తెల్లవారు జామున 6 గంటల మధ్య సంభవిస్తున్నాయి. అయితే ఈ మరణాలపై హాస్పిటల్ వైద్యులు వింత వాదన చేస్తున్నారు. వారందరూ న్యూమోనియాతో చనిపోయారని, ఆక్సిజన్ లభ్యం కాక కాదని ఖండిస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు మాత్రం ఆక్సిజన్ లేకనే చనిపోతున్నారని, అర్థరాత్రి ఎవరూ రోగులను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.