FbTelugu

ఆక్సిజన్ లేక డాక్టర్ సహా 8మంది మృతి

న్యూఢిల్లీ: ఆక్సిజన్ లభ్యం కాక దేశంలో ఏదో ఒక ఆసుపత్రిలో కరోనా రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఢిల్లీలో ఆక్సిజన్ లేక ఒక డాక్టర్ సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవాళ ఉదయం బాత్రా ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు నిండుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నది. ఆక్సిజన్ ట్యాంకర్లు ఆసుపత్రి చేరుకునే లోపే 8 మంది ఊపిరి ఆడక చనిపోయారు. ఐసియులో చికిత్స పొందుతున్న ఆరుగురు కరోనా రోగులు, వార్డులో ఇద్దరు మృతి చెందారు. వీరిలో అదే ఆసుపత్రికి చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజీ యూనిట్ హెడ్ డాక్టర్ ఆర్.కె.హింథనీ కూడా ఉండడం పలువురిని కన్నీళ్లు తెప్పించింది. ఆక్సిజన్ అయిపోతున్నదంటూ ముందుగానే ప్రభుత్వానికి లేఖ పంపించాం, మధ్యాహ్నం 12 గంటలకే నిల్వలు నిండుకోవడంతో ప్రాణాలు పోయాయని ఆసుపత్రి ప్రకటించింది. దాదాపు గంటన్నర ఆలస్యంగా 1.30 గంటలకు ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకున్నాయని పేర్కొంది. ప్రాణాలు కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించామని, పరిస్థితులు అనుకూలించలేదని యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.