FbTelugu

రూ.8 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం

రాయ్ పూర్: కొరాపుట్ జిల్లాలోని పట్టాంగి పోలీస్ స్టేషన్‌లో పరిధిలో సుమారు రూ.8 కోట్ల నకిలీ నోటును స్వాధీనం చేసుకున్నట్లు సునాబేదా ఎస్‌డిపిఓ నిరంజన్ బెహెరా వెల్లడించారు.

తరలిస్తున్న వాహనంలోని నోట్లన్నీ నకిలీ రూ.500 కట్టలు కట్టలుగా ఉన్నాయని చెప్పారు. వాహానాల తనిఖీల్లో భాగంగా కోరాపుట్ పోలీసులు వాహనాన్ని ఆపినప్పుడు రూ.7.9 కోట్ల విలువైన నకిలీ నోట్లు దొరికాయి ఆయన వివరించారు. తనిఖీ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఛత్తీస్‌గడ్ లోని రాయ్‌పూర్ నుంచి విశాఖపట్నం వరకు ముగ్గురు యువకులు బయలుదేరారు. వారి వద్ద ఉన్న ట్రాలీ బ్యాగ్‌ లలో నకిలీ నోట్లు ఉన్నాయని పోలీసులు చెప్పారు. నిందితులు ఛత్తీస్‌గడ్ లోని జంజాగిర్‌లోని చంపా జిల్లాకు చెందినవారపి వారి నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, రూ.35,000 నగదు లభ్యమైందన్నారు. కొన్ని క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఐడి ప్రూఫ్‌లు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారి పై కేసు నమోదు చేసి, వాహనాన్ని జప్తు చేసి విచారిస్తున్నామని సునాబేదా ఎస్‌డిపిఓ నిరంజన్ బెహెరా తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.